ASR: ముంచంగిపుట్టు మండలం బుంగాపుట్టు పంచాయతీ కొజ్జిరిగుడ గ్రామానికి రహదారి సదుపాయం లేక 30 గిరిజన కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు. బుంగాపుట్టు వరకు ఉన్న పీఆర్ రోడ్డు నుంచి గ్రామం వరకు 800 మీటర్ల మేర రహదారి నిర్మించాల్సి ఉంది. మార్గమధ్యంలోని వాగుపై కల్వర్టు లేకపోవడంతో ద్విచక్ర వాహనాలను భుజాలపై మోసుకుంటూ ఒడ్డుకు చేరాల్సి వస్తోందని గ్రామస్థులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు.. కల్వర్టు లేక అవస్థలు


