హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

ప్రకాశం: దోర్నాల మండలం వెలిగొండ ప్రాజెక్టు నుంచి ఈ నెల 31న సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. గంటవానిపల్లి హెలిప్యాడ్, జలహారతి ప్రదేశం, పైలాన్, గేట్లు, సభా వేదిక, పార్కింగ్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.