ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులు శనివారం చివరి రోజు కావడంతో పుట్టిన ఊరు, పీల్చిన గాలి, ఇన్నాళ్ల జ్ఞాపకాలను వదిలివెళ్లలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. చిన్నారుల నుంచి అవ్వాతాతల వరకు గ్రామాన్ని వీడలేక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టిన గడ్డను వదిలి కొత్త ప్రాంతానికి వెళ్లాలంటే గుండె తరుక్కుపోతోందని బాధను వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సొంతూరును వదల్లేక.. కన్నీరు!


