హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కావలి మాజీ ఎంపీపీ మృతి

నెల్లూరు: కావలి మండలం మాజీ ఎంపీపీ దామిశెట్టి శాంతమ్మ శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె సర్వాయపాలెం ఎంపీటీసీగా, కావలి మండల జెడ్పీటీసీగా, మండలాధ్యక్షురాలిగా పలు రాజకీయ పదవులు నిర్వహించారు. స్వగ్రామమైన సర్వాయపాలెంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.