హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు నుంచి జారిపడి వాసి మృతి!

VZM: రైలు నుంచి జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా తేలప్రోలు గూడ్స్ యార్డు సమీపంలో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా సింగరాయి గ్రామానికి చెందిన వాసాది స్వామి(26) శనివారం తెల్లవారుజామున విశాఖపట్నం వెళ్తుండగా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడినట్లు ప్రాథమిక సమాచారం. స్టేషన్ మాస్టర్ సమాచారం మేరకు SI దానం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.