ASR: జీకేవీధి మండలం దామనాపల్లి స్వర్ణ గ్రామ సచివాలయంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బీహెచ్‌వీ రమణబాబు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు, ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో అధికారులకు అందజేయవచ్చన్నారు. అన్ని శాఖల అధికారులు హాజరవుతారని, ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు సచివాలయంలో PGRS


