హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిమ్మ ధరలకు రెక్కలు.. బస్తా రూ.12 వేలు

నెల్లూరు: తోటల్లో నిమ్మకాయల దిగుబడి గణనీయంగా తగ్గడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డులో ప్రస్తుతం బస్తా (లూజు) ధర రూ.12 వేలకు చేరింది. కిలో నిమ్మకాయలు రూ.85 నుంచి రూ.150 వరకు పలుకుతున్నాయని వ్యాపారులు తెలిపారు. శ్రావణమాసం నేపథ్యంలో తమిళనాడులో డిమాండ్ పెరగడంతో ధరలు ఎగబాకుతున్నాయి.