హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పుల ఒత్తిడితో యువకుడి బలవన్మరణం!

​PLD: చిలకలూరిపేట మండలం అప్పుల బాధ తాళలేక నేరళ్ల ఏడుకొండలు (32) అనే యువకుడు ప్రాణాలు విడిచిన ఘటన ఎన్.వి. నారాయణరెడ్డి కాలనీలో జరిగింది. గతంలో చేసిన బెట్టింగ్‌ల వల్ల ఏర్పడిన అప్పుల ఒత్తిడే దీనికి కారణమని తెలుస్తోంది. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.