హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

SKLM: నిరుద్యోగ యువతకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్ ,హౌస్‌వైరింగ్‌, సీసీ కెమెరా ఇన్‌స్టాలేషన్‌‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు నైరేడ్‌ డైరెక్టర్‌ ఎ. భారతి తెలిపారు. 19 - 50 ఏళ్ల మధ్య వయసున్న ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 31లోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి సదుపాయం కల్పిస్తామని తెలిపారు.