హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్ని ప్రమాదంలో 15 ఎకరాల గడ్డి వాములు దగ్ధం

PLD: నాదెండ్ల మండలం సాతులూరులో దారుణ అగ్నిప్రమాదం జరిగింది. రైతు బాలకృష్ణ పొలంలో అమర్చిన వరి గడ్డి వాముకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి.15 ఎకరాల వరి గడ్డి పూర్తిగా కాలి బూడిదవడంతో రైతు తీవ్రంగా నష్టపోయారు. మంటలు ఎగసిపడటంతో ఊరి ప్రజలు ఆందోళన చెందారు. నరసరావుపేట అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.