అన్నమయ్య: మదనపల్లె బయ్యా రెడ్డి కాలనీలో శనివారం దండా మణి(38) హత్యకు గురైన ఘటనలో భర్త మధుకర్ రెడ్డే నిందితుడని డీఎస్పీ బుచ్చిరాజు తెలిపారు. తంబళ్లపల్లె మండలం మొద్దలదొడ్డి దిగువపల్లికి చెందిన మధుకర్ రెడ్డి ఓ కేసులో పదేళ్ల జైలు శిక్ష అనుభవించి ఈ నెల 14న విడుదలయ్యాడన్నారు. అనంతరం భార్యను హత్య చేసినట్లు తెలిపారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లెలో భార్యను హత్య చేసిన భర్త


