అన్నమయ్య: మదనపల్లెలో ఆదివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. CTM రోడ్డులోని తట్టివారిపల్లి ఫ్లైఓవర్ వద్ద దంపతులు ప్రయాణిస్తున్న బైకును కర్ణాటకకు చెందిన కారు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడ్డారు. బాధితురాలిని 108లో జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లెలో ఘోర రోడ్డు ప్రమాదం..!


