హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై కేసులు నమోదు..!

KDP: జిల్లా వ్యాప్తంగా శనివారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 338 కేసులు నమోదు చేసి రూ. 93,120 జరిమానా విధించినట్లు SP విశ్వనాథ్‌ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాలని సూచించారు. రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు.