హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమనాథ్ యాత్రకు దరఖాస్తుల ఆహ్వానం

NDL: సోమనాథ్ యాత్రకు ఆసక్తి ఉన్న భక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ పేరుతో జాతీయ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శ్రీశైలం దేవస్థానం నుంచి 50 మంది భక్తులను యాత్రకు పంపనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల భక్తులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.