హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపాలిటీకి కమిషనర్లు రారా.. వస్తే ఉండరా?.

పార్వతీపురం మున్సిపాలిటీలో సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బురదనీరు,గోతుల రోడ్లు,పారిశుద్ధ్య లోపం,వీధి దీపాల సమస్యలు వేధిస్తున్నాయని తెలిపారు. వర్షాలు కురిస్తే కాలువలు,చెరువులు పొంగి రోడ్లపై నీరు ప్రవహిస్తోందన్నారు. మున్సిపల్ కమిషనర్లు తరచూ మారడం వల్ల పాలన,అభివృద్ధి పనులు ప్రభావితమవుతున్నాయని వాపోతున్నారు.