హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎలుకల నివారణ మందు పంపిణీ..!

WG: రైతులందరూ సామూహికంగా ఏకకాలంలో ఎలుకల బొరియలలో మందు పెట్టాలని వీరవాసరం వ్యవసాయాధికారి బెన్సీబాబు సూచించారు. శనివారం సాయంత్రం 'బ్రోమోడయోలోన్' కలిపిన విషపు ఎర పొట్లాలను రైతులకు పంపిణీ చేశారు. పంటలను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన నివారణ చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్, స్థానిక రైతులు పాల్గొన్నారు.