నెల్లూరు: కలిగిరి (M) తూర్పుగుడ్లదొన గ్రామానికి చెందిన P.వెంకటేశ్వర్లుపై నిందితుడు చిన్నయ్య ఈ నెల 25న రాత్రి కర్రతో దాడి చేసి, అనంతరం పెట్రోల్ పోసి మోటార్ సైకిల్‌ను తగలబెట్టిన ఘటనపై కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని పాతనాపురం సెంటర్ వద్ద అరెస్ట్ చేసినట్లు SI లతీఫున్నీస్సా పేర్కొన్నారు. అనంతరం నిందితుడిని రిమాండుకు తరలించినట్లు ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బైకు దహనం కేసులో నిందితుడి అరెస్ట్: కలిగిరి SI


