హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్తు పదార్థాలపై పోలీసుల అవగాహన

WG: సైబర్ నేరాలు, మహిళలు-చిన్నారుల భద్రత, మత్తు పదార్థాల వినియోగంపై దువ్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం పోలీసులు అవగాహన కల్పించారు. తణుకు రూరల్ ఎస్ఐ త్రిమూర్తులు పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండటం, చిన్నారులు, మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.