హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌కు జిల్లా క్రీడాకారులు

KRNL: గుంటూరులో సెప్టెంబర్‌ 1 నుంచి 4 వరకు నిర్వహించనున్న ఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌కు కర్నూలు రేంజ్‌ నుంచి ఎంపికైన క్రీడాకారులకు DIG కోయ ప్రవీణ్‌ నిన్న స్పోర్ట్స్‌ కిట్లు అందజేశారు. క్రీడాకారులను అభినందించి, పోటీల్లో ప్రతిభ కనబరిచి రేంజ్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెంపొందిస్తాయన్నారు.