హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: సీఐ

WG: వాహనాలపై రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను నిబంధనలకు అనుగుణంగా స్పష్టంగా, కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని తణుకు పట్టణ సీఐ జేవీ రమణ సూచించారు. నంబర్ ప్లేట్ల నిబంధనల అమలులో భాగంగా శనివారం తణుకులో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసిన వాహనాలను గుర్తించి, వాహనదారులకు పలు సూచనలు చేశారు.