హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలిక అదృశ్యం.. తెలంగాణలో గుర్తింపు!

BPT: సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న బాలిక శుక్రవారం రాత్రి అదృశ్యమవగా, శనివారం రాత్రికి పోలీసులు తెలంగాణలో గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సంతమాగులూరు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి బాలికను సురక్షితంగా స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శేషగిరిరావు వివరాలు వెల్లడించారు