హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తులు

KRNL: సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులకు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ డా. నాగరాజాశెట్టి తెలిపారు. పీజీలో 55 శాతం మార్కులు సాధించిన వారు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో నేరుగా హాజరు కావాలన్నారు. నెట్‌, సెట్‌, పీహెచ్‌డీ, బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.