హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒకేసారి 3వేల మందికి భోజనం

కోనసీమ: వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిత్యం వేలాది మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ.6.25 కోట్లతో ఆధునిక వంటశాల, భోజనశాల నిర్మించారు. ఆలయ తూర్పువైపున నిర్మించిన ఈ సముదాయాన్ని నేడు ప్రారంభించనున్నారు. ఒకేసారి 3 వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించే సౌకర్యం కల్పించారు.