ప్రకాశం: కంభం పట్టణంలోని కందుల పురం సెంటర్ సమీపంలో ఆదివారం ఉదయం ఓ లారీ దగ్ధమైంది. ఈ లారీ సిమెంట్ మెటీరియల్ ట్యాంకర్‌ను తప్పించబోయి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. లారీలో ఆకస్మత్తుగా మంటలు చెలరేగి రెండు బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. డ్రైవర్ అప్రమత్తమై ప్రాణాలు దక్కించుకున్నాడు. లారీ దాచేపల్లి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్
డివైడర్‌ను ఢీకొట్టిన లారీ.. ఆకస్మత్తుగా పంటలు


