హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సచివాలయాల్లో రోజూ పీజీఆర్ఎస్

KRNL: కర్నూలు జిల్లాలోని స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు PGRS నిర్వహించాలని జిల్లా అధికారి టీవీ భాస్కరనాయుడు ఆదేశించారు. క్షేత్రస్థాయి విధులు ముగించుకున్న ఉద్యోగులు తప్పనిసరిగా PGRSకు హాజరై ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు