కృష్ణా: తిరుపతిలో జరిగిన అమరావతి కప్-2026 రాష్ట్రస్థాయి అండర్-23 బాలికల షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పెనమలూరుకి చెందిన యశ్విత సాయి పసిడి పతకం సాధించింది. క్రీడా నైపుణ్యంతో రాణించి విజేతగా నిలిచిన ఆమెకు ఎమ్మెల్యే చంద్ర చేతుల మీదుగా పతకం అందజేశారు. వ్యాయామ ఉపాధ్యాయుడు మురళి ప్రోత్సాహంతోనే ఆమె ఈ విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పసిడి పతకం సాధించిన క్రీడాకారిణి


