ATP: కుందుర్పి మండలం కరిగానిపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరికీ శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఆర్వో ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఎస్సార్సీ ట్రస్ట్ నిధులతో చేపట్టే ఈ ప్లాంట్ పనులను MLA అమిలినేని సురేంద్ర బాబు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకే ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కరిగానిపల్లిలో ఆర్వో ప్లాంట్‌కు భూమిపూజ


