హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి విక్రయిస్తున్నారని మహిళలు ఫిర్యాదు

కాకినాడ: జగ్గంపేట మండలం రామవరం యానాదుల కాలనీ వద్ద గంజాయి విక్రయాలు చేస్తున్న మర్రి చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని ఆ కాలనీవాసులు కోరారు. శనివారం జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రశేఖర్ గంజాయి విక్రయిస్తున్నాడని, పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.