హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీట్ల కోసం పాట్లు పడుతున్న ప్రయాణికులు

PLD: వినుకొండలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల్లో సీట్ల కోసం తోటి ప్రయాణికులతో పోటీ పడాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరిగినా, అందుకు అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.