హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మాజీ మంత్రితో సహా పలువురిపై కేసు కొట్టివేత

కృష్ణా: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సహా 17 మందిపై నమోదైన కేసును ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక జిల్లా న్యాయమూర్తి దుర్గాపూర్ణిమ శనివారం కొట్టివేశారు. 2021 జూలై 27న దాసరి సురేష్ తదితరులపై దాడి, హత్యాయత్నం ఆరోపణలతో జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన సాక్షులు ప్రాసిక్యూషన్‌కు వ్యతిరేకంగా మారడంతో, సరైన ఆధారాలు లేక కోర్టు కేసు కొట్టేసిందన్నారు.