హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై భక్తి రంజని సంగీత కచేరి.!

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మపథం కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం నిర్వహించిన ‘భక్తిరంజని’ సంగీత కచేరి భక్తులను ఆకట్టుకుంది. వై.అనూరాధ బృందం ఆధ్వర్యంలో భూమిక, రిషితలు అన్నమయ్య, కర్ణాటక శాస్త్రీయ సంకీర్తనలు ఆలపించారు. వయోలిన్, మృదంగం వాద్య సహకారం అందించారు.