కృష్ణా: ఉయ్యూరులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 6,850 నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాటకు బానిసై కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దని పోలీసులు సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి కోరారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట స్థావరంపై పోలీసుల దాడి


