కృష్ణా: పెదపారుపూడి మండలంలో ప్రతి ఒక్కరు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పెదపారుపూడి ఎస్సై సుభాషిని అన్నారు. మండల కేంద్రమైన పెదపారుపూడిలోని ZPHSలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసవ్వకుండా ఉండాలని అన్నారు. కేసుల్లో ఇరుక్కుని జీవితాలను పాడుచేసుకోవద్దని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై


