NTR: చందర్లపాడు మండలంలోని కోనాయిపాలెం గ్రామ శివారులో శనివారం సాయంత్రం సుబాబు తోటలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కాండ్రపాడుకి చెందిన రైతు రమణకు చెందిన ఆరెకరాల తోటలో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు ఎకరం మేర పంట దెబ్బతినగా రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కోనాయిపాలెంలో అగ్నిప్రమాదం


