NTR: చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని బండిపాలెంలో పోలీసులు 'పల్లె నిద్ర' కార్యక్రమం నిర్వహించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. పోలీసులు గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బండిపాలెంలో పల్లె నిద్ర కార్యక్రమం


