హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌లో కర్నూల్ ఎంబీబీఎస్ విద్యార్థి మృతి

KRNL: హైదరాబాద్‌లో కర్నూలుకు చెందిన MBBS విద్యార్థిని యశ్విత(26) రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఇవాళ జరగనున్న NEET-PG పరీక్షకు సిద్ధమవుతున్న ఆమె, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని హాస్టల్‌లో విషం తాగినట్లు సమాచారం. మానసిక ఒత్తిడి కారణంగానే యశ్విత ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.