హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు బ్రాహ్మణ సంక్షేమంపై చర్చ

VSP: వేద విజ్ఞాన పరిషత్తు ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు బ్రాహ్మణ సంక్షేమ మేధావుల ఆత్మీయ చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బ్రాహ్మణ సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు హాజరుకావాలని కోరారు. సమాజ అభివృద్ధిలో బ్రాహ్మణ సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలు, విద్య, ఉపాధి అంశాలపై చర్చించనున్నారు.