హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మంగపల్లెలో ఉచిత వైద్య శిబిరం

NDL: సంజామల మండల పరిధిలోని మంగపల్లెలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు డా.పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కోవెలకుంట్ల, సంజామల మండలాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య పరీక్షల అనంతరం అనారోగ్య సమస్యలున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.