హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నీట్-పీజీ పరీక్ష

VSP: ఎన్ బిఈఎంఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నీట్-పీజీ ప్రవేశ పరీక్ష (సీబీటీ) నిర్వహించనున్నారు. నగరంలో షీలానగర్, చినముషిడివాడలోని ఐయాన్ డిజిటల్ జోన్ కేంద్రాలతో సహా మూడు కేంద్రాల్లో 1,947 మంది పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుండగా అభ్యర్థులు అరగంట ముందుగా రావాలని అధికారులు సూచించారు.