NTR: విజయవాడ వాంబే కాలనీలో ఒంటరిగా నివసిస్తున్న మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. మరుసటి రోజు ఆమె స్పందించకపోవడంతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో నున్న పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళపై ఐదుగురి అఘాయిత్యం


