హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వాట్సాప్‌ గ్రూపుల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు'

KDP: వాట్సాప్‌ గ్రూపుల్లో రెచ్చగొట్టే, వివాదాస్పద వ్యాఖ్యలు, ఇతరులను కించపరిచే పోస్టులకు దూరంగా ఉండాలని కమలాపురం SI శ్రీనివాసులు సూచించారు. సున్నితమైన అంశాలపై వాస్తవ నిర్ధారణ లేకుండా సమాచారాన్ని షేర్ చేయవద్దన్నారు. గ్రూపుల్లో పోస్టులకు వ్యక్తిగత బాధ్యత ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.