NLR: శ్రీశైలం నుంచి సోమశిల, కండలేరు జలాశయాలకు వెంటనే నీరు విడుదల చేయాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీశైలంలో 153.5 టీఎంసీలు (71%) ఉండగా, సోమశిల, కండలేరుల్లో 25% మాత్రమే ఉందన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీరు వదిలే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నీటి పారుదల కాకుండా నిధుల పారుదలపై దృష్టి పెట్టిందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
సోమశిలకు నీటిని విడుదల చేయాలి: కాకాణి


