హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ధరలు అదుపు చేయడంలో విఫలం'

SKLM: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. బియ్యం, పప్పులు, వంట నూనెలు, కూరగాయలు, చక్కెర, ఉల్లిపాయల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు.