CTR: గంగవరం మండలం దండపల్లి పంచాయతీ పరిధిలోని దండపల్లి గ్రామ బీసీ కాలనీలో ఏడాదిగా మురుగునీటి సమస్య కొనసాగుతోంది. పలు వీధుల్లో మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్లపై మురుగునీరు.. గ్రామస్తులు అవస్థలు


