హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం'

PPM: అమరవీరులు, మృతిచెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలు, రిటైర్డ్‌ సిబ్బందికి అన్ని విధాలా అండగా ఉంటామని ఎస్పీ ఎస్‌.వి. మాధవ్‌రెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన సంక్షేమ సమావేశంలో వారి సమస్యలు, పెండింగ్‌ బెనిఫిట్స్‌పై ఆరా తీశారు. ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని డీపీవో అధికారులను ఆదేశించారు.