హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంగమాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు

NLR: దుత్తలూరు మండలంలోని నర్రవాడ శ్రీ వెంగమాంబ అమ్మవారిని జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఫరూఖ్, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్, మాజీ జడ్పీ ఛైర్మన్ చెంచలబాబు యాదవ్ శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.