అన్నమయ్య: పెనగలూరు మండలం ఓబిలిలో రూ.1.85 కోట్లతో చేపట్టనున్న తారు రోడ్డు పనులకు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి భూమిపూజ చేశారు. ఓబిలి సత్రం–అతిగారిపల్లి, పద్మనాభస్వామి ఆలయం–అరుంధతివాడ రహదారులు అభివృద్ధి చేయనున్నారు. గ్రామస్థులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
రూ.1.85 కోట్లతో రహదారి పనులకు భూమిపూజ


