హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దశాబ్దాల కల నెరవేరుతున్న వేళ

CTR: నగరి మండలం బీరకుప్పం రోడ్డు నిర్మాణానికి రూ.1.80 కోట్లు మంజూరు చేయించడంతో తారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని స్థానికులు తెలిపారు. దశాబ్దాలుగా రోడ్డు సమస్యతో ఇబ్బందులు పడుతున్న పలు గ్రామాల ప్రజలకు రోడ్డు నిర్మాణంతో ఉపశమనం కలగనుంది.