హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ

కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జి. బిందు మాధవ్ ఆధ్వర్యంలో శనివారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులు, దొంగతనాలు, మహిళలు–చిన్నారులపై నేరాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై సమీక్షించారు. ఆధారాలను పకడ్బందీగా సేకరించి నేరస్తులకు శిక్షలు పడేలా దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ ఆదేశించారు.