హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగులకు కలెక్టర్‌ చేయూత

NTR: జిల్లా కలెక్టరేట్‌లో ఇవాళ 58 మంది దివ్యాంగులకు రూ.66.70 లక్షల విలువైన మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలను కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పంపిణీ చేశారు. దివ్యాంగులు స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుని స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం ఈ వాహనాలను ఉచితంగా అందిస్తోందని అన్నారు. 113 దరఖాస్తుల నుంచి 58 మందిని ఎంపిక చేశామని పేర్కొన్నారు.